శ్రీభాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు అనన్తశ్రీవిభూషిత శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారు 30 వ వానమామలై పీఠాధిపతులైన త్రిదండి కలియన్ రామానుజ జీయర్ స్వామి వారి దగ్గర 1998 వ సంవత్సరంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రత్యక్ష ఆజ్ఞతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని వారి ఆరాధ్య దైవంగా చేసుకొని వారికి గోవిందుడు అని నామకరణం చేసి 2000 సంవత్సరం లో పశ్చిమగోదావరిజిల్లా భీమవరం పట్టణంలో శ్రీ ,భూ ,గోదా సమేత గోవింద పెరుమాళ్ళ కృపతో శ్రీభాష్యకార సిద్ధాంత పీఠాన్ని స్థాపించి భగవద్రామానుజ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఎంతోమందిని ఉజ్జీవింపచేస్తున్నారు శ్రీ స్వామివారు లోకకళ్యాణార్థం ఫాల్గుణమాసంలో లక్ష్మీ అమ్మవారి తిరునక్షత్ర సందర్భంగా ప్రతి సంవత్సరం 250 గ్రామములు పాదయాత్ర పూర్వక భిక్షా పర్యటన చేసి ఆ ద్రవ్యంతో శ్రీమహాలక్ష్మి యాగమును నిర్వహించేవారు అలాగే ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం, ఎంతోమంది కుటుంబాలకి ఆర్థిక సహాయం అందిస్తూ శ్రీరామచంద్రుడి మార్గాన్ని అనుసరించిన భగవద్రామానుజుల మార్గంలో నడుస్తూ మన ధర్మ రక్షణ కోసం ఎన్నో ప్రాంతాల్లో"గోవింద క్షేత్రం "అనే పేరుతో ఎన్నో ఆలయాలని ప్రతిష్ట చేశారు అదేవిధంగా లోకంలో గోహత్య ధర్మ భ్రష్టత నివారణ అయి దాని ద్వారా అందరిలో సద్భావన పెరిగి అందరూ భగవత్ కృపకు పాత్రులు కావాలి అనే సంకల్పంతో శ్రీమద్భాగవత సప్తాహాలు అదేవిధంగా 108 సుదర్శన యజ్ఞములు నిర్వహించుచున్నారు లోక కళ్యాణార్థం మన ధర్మ పరిరక్షణ కోసం ఇంకా ఎన్నో ధార్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Sampoorna Srimadh Bhagavatha Pravacahanam By Sri Sri Sri Tridandi Sri Ramachnadra Jeeyar Swamy
Send me a message or ask me a question using this form. I will do my best to get back to you soon!
Bhimavaram, Andhra Pradesh, India
Open today | 09:00 am – 05:00 pm |
Govinda Jeeyar
Bhimavaram, Andhra Pradesh, India
Copyright © 2024 Govinda Jeeyar - All Rights Reserved.
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.